సగం-ఉడకబెట్టిన బియ్యంతో సొమ్ము చేసుకోవడం

వరిబియ్యంలో పోషకాలు చాలా ఉన్నప్పటికీ, ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాని నాణ్యత చాలా వరకూ పోతుంది. ఫలితంగా మార్కెట్‌లో నాసిరకం బియ్యం వస్తున్నాయి. అందుకని వినియోగదారులు దిగుమతి చేసుకున్న బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. వెచ్చని నీళ్ళతోనూ ఆవిరితోనూ వరిబియ్యాన్ని సగం ఉడకబెట్టి, దాని నాణ్యతను మెరుగుపరచే ఒక పద్ధతిని పార్బాయిలింగ్ అంటారు.

ఈ వీడియోలో మీరు పార్బాయిలింగ్ గురించి నేర్చుకుంటారు. ముందుగా, పార్బాయిలింగ్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను చూద్దాం. నాణ్యమైన బియ్యానికి మార్కెట్లో గిరాకీ  పెరుగుతోంది. ఆహారవిక్రేతలు, రెస్టారెంట్ యజమానులు సగం-ఉడకబెట్టిన వరిబియ్యాన్ని వాడడం ప్రారంభించారు. ఎందుకంటే అది అప్పటికే శుభ్రం చేసి ఉంటుంది, పైగా దాన్ని వండడం తేలిక.

పార్బాయిల్ చేసిన బియ్యాన్ని వండడానికే జనాలు ఇష్టపడతారు, ఎందుకంటే బియ్యాన్ని శుభ్రం చేయడానికి టైం తక్కువ పడుతుంది. ముఖ్యంగా, పార్బాయిల్ చెయ్యని వరిబియ్యంకన్నా, పార్బాయిల్ చేసిన బియ్యంలో పోషకాలు ఎక్కువ.

Idioma actual
Telugo
Necesita un idioma?
Si desea que este video sea traducido a otro idioma, por favor contactar a kevin@accessagriculture.org
Traducido en
INDIA
Traducción financiada por
KGJ
Uploaded
1 year ago
Duración
12:38
Producido por
AfricaRice, Agro-Insight, Countrywise Communication, INRAB, SG2000, Songhai