మట్టి యొక్క pH ని, జైవిక పదార్థాన్ని విశ్లేషించడం
Uploaded 1 week ago | Loading
15:04
తరిగిపోయిన, బాగా కడుక్కుపోయిన మట్టి సాధారణంగా ఆమ్లీయంగా ఉంటుంది. రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడినా మట్టి ఆమ్లీయమౌతుంది. జైవిక పదార్థాలు కుళ్లడానికి దోహదపడే సూక్ష్మక్రిములని ఆమ్లీయ మట్టి నిరోధిస్తుంది. ఆమ్లీయ మట్టి పంటలకు తక్కువ పోషకాలు అందనిస్తుంది. మంచి మట్టిలో జైవిక పదార్థాలు ఎక్కువుంటాయి. మొక్కలు, పశువుల ద్వారా లభించే సజీవ, నిర్జీవ పదార్థాలన్నీ జైవిక పదార్థాలలో ఉంటాయి. 2 మిల్లీమీటర్లకన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని “పార్టిక్యులేట్ ఆర్గానిక్ మేటర్ – పరమాణుమయ జైవిక పదార్థం” అంటారు. 2 మిల్లీమీటర్లకన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని “పార్టిక్యులేట్ ఆర్గానిక్ మేటర్ – పరమాణుమయ జైవిక పదార్థం” అంటారు. ఈ తునకలు ఎక్కువగా ఉన్న భూముల మట్టి మెత్తబడి, పోషకాలు నిండి, ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
Current language
Telugu
Produced by
Agro-Insight