స్కూళ్ళలో వ్యవసాయ జీవావరణాన్ని బోధించడం
Uploaded 1 month ago | Loading
14:23
స్థానిక సంస్కృతిని గౌరవించడానికి, ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, స్కూళ్ళు తమ పాఠ్యక్రమంలోనూ కార్యాచరణల్లోనూ సేద్యం, సాంప్రదాయిక ఆహారానికి సంబంధించిన విషయాలను చేర్చడం ముఖ్యం. స్కూల్ పాఠ్యక్రమంలో అన్ని తరగతుల్లోనూ వ్వవసాయ జీవావరణానికి సంబంధించిన మూలకాలని చేర్చాలి. క్షేత్ర దర్శనాలు నిర్వహిస్తే, పిల్లలు రైతుల ద్వారా స్థానిక రకాలు, జీవావరణ సేద్య పద్ధతులు, వ్యవసాయ పరికరాల గురించి నేర్చుకోగలుగుతారు. స్థానిక సేద్య సంస్కృతికి అంకితపరచిన ఒక గదిని మీరు సృష్టిస్తే, పిల్లలు అక్కడ పుస్తకాలు చదవుతూ, వీడియోలు చూస్తూ, వాళ్ళు గీసిన బొమ్మలని ప్రదర్శిస్తూ, ఆటలు ఆడుకోగలుగుతారు. ఒక స్కూల్ తోటలోఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి పంటలు ఇతర మొక్కలను పెంచవచ్చు. స్థానిక దినుసులతో ఆరోగ్యకరమైన స్కూల్ భోజనాన్ని అందించడం ముఖ్యం.
Current language
Telugu
Produced by
Agro-Insight