పాడి ఆవులలో కాల్షియం కొరత
Uploaded 1 year ago | Loading
15:29
ఈ వీడియోలో, ఆచరణాత్మకమైన చిట్కాలు ఇంకా చాలా ఉన్నాయి. పాలు ఎక్కువ ఇచ్చే ఆవులలో కాల్షియం కొరత సాధారణం. కాల్షియం కొరత ఏర్పడిన ఆవు సరిగ్గా తినదు. తాకితే చల్లగా ఉంటుంది. అలసినట్లు కనిపిస్తూ, లేచి నిలబడలేకపోతుంది. తక్కువ పాలు ఇస్తుంది. వైద్యం జరగని ఆవులు చనిపోవచ్చు. కాల్షియం కొరతని అరికట్టడానికి, మీ ఆవుల కొమ్ములు కోయవద్దు. చల్లపాటి వేళ మీ ఆవులకి కొంత ఎండ తగలనివ్వాలి. అప్పుడవి విటమిన్ డి తయారు చేసుకుని, మరింత కాల్షియంని గ్రహిస్తాయి. ఆవులకి గింజల దాణాని, మొక్కజొన్నలు, కాల్షియం సమృద్ధిగా ఉండే ఆకులనీ పెట్టాలి. ఆవులు తాగే నీళ్ళలోగానీ, దాణాలోగానీ ఖనిజ మిశ్రమాన్ని కలపాలి. పితికిన తర్వాత, ఒక్కో ఆవుకీ ఒక బుట్ట నిండా పచ్చి గడ్డి పెట్టాలి.
Current language
Telugu
Produced by
Green Adjuvents