మంచి సూక్ష్మజీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి
Uploaded 1 year ago | Loading
16:11
షాపులో కొన్న కాన్సంట్రేటెడ్ E.M. ని మొలాసిస్, నీళ్ళలో కలిపి, నీడలో వారం రోజులపాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై, చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారుచేసుకోవచ్చు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్ళలో కలిపి, ఏ పంటమీదనైనా, విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే, తెగుళ్లు, వ్యాధులు తగ్గి, చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు.
Current language
Telugu
Produced by
Rezaul Karim Siddique