మిరప విత్తనాల పాదు తయారీ
Uploaded 1 year ago | Loading
13:34
మీటర్ వెడల్పున్న విత్తనాల పాదులో నాణ్యమైన విత్తనాలు విత్తాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా, బలహీనంగా ఎదిగి, నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదుమీద గడ్డిగానీ, తాటాకులుగానీ, ఇతర మల్చ్ గానీ పరిస్తే, ఎండా వానల తాకిడినుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి, పురుగులూ జంతువులబారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన, ఆరోగ్యమైన మొలకలే, ఆరోగ్యమైన మంచి ఉత్పాదకతగల పంటకి ప్రారంభం.
Current language
Telugu
Produced by
Agro-Insight